జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
* నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.
జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాలను తిలకించడం జరిగింది, అదేవిధంగా స్వయం సహాయక బృందాలచే ఏర్పాటుచేసిన ప్రదర్శనను, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటుచేసిన ప్రదర్శనను, మానవాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తహీనతకు మరియు మహిళలు & పిల్లలు ఎదుర్కొంటున్న అనారోగ్యాల దృష్ట్యా ఏర్పాటు చేసిన డ్రైఫ్రూట్స్ స్టాల్ ను సందర్శించడం జరిగింది. పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చార్ట్ ను చూడడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల తదితరులు పాల్గొన్నారు.