జోగులాంబ అమ్మవారి టెంపుల్ని మరియు రికార్డులను ఆకస్మిక తనిఖీ అడిషనల్ దేవాదాయ శాఖ కమిషనర్

జోగులాంబ గద్వాల 12 మార్చ్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: అలంపూర్. జోగులాంబ అమ్మవారి ఆలయంలో గత కొద్ది రోజులుగా ఆలయము పై వస్తున్న పలు ఆరోపణల అంశమై ఈ రోజు తేదీ: 12.03.2025 బుధ వారము నాడు దేవాదాయ శాఖ అధనపు కమీషనర్, శ్రీ శ్రీనివాసరావు ఆలయమునకు విచ్చేసి ఆలయ భూముల వివరాలు, పలు రకాల టెండర్ల వివరాలు, రోజువారీ డి.సి.ఆర్. వివరాలు, క్యాష్ బుక్, ప్రసాదముల సత్రం, అన్నదాన సత్రం స్టాక్ బుక్ లను, అన్నదాన విరాళములు మరియు విరాళముల రశీదు బుక్కులను, పరిశీలించారు, అలాగే అన్నదాన సత్రం నందు అన్న ప్రసాద వితరణ, ప్రసాదముల తయారీ సత్రం నందు ప్రసాదముల నాణ్యత, పరిమాణములను, కౌంటర్లను పరిశీలన చేశారు. అనంతరం ఇట్టి నివేదికను దేవాదాయ శాఖ కమీషనర్ కి అందజేస్తామని దేవాదాయ సిబ్బందికి తెలియజేశారని టెంపుల్ సిబ్బంది తెలియజేశారు.