జిల్లా కోర్టు సముదాయానికి స్థల సేకరణకు ప్రభుత్వం తరఫున సహకరిస్తాం.

జోగులాంబ గద్వాల 19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కోర్టు సముదాయం కోసం సమీపములో జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా జిల్లా ప్రజల తరపున నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష చేస్తున్న బార్ అసోసియేషన్ సభ్యులందరికీ మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి ఈరోజు ఉదయం 12 గంటలకు గద్వాల్ జిల్లా కోర్టు ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టిన అడ్వకేట్ మిత్రులకు పూలమాలతో వారికి సన్మానం చేసి మద్దతు తెలపడం జరిగింది .ఈ కార్యక్రమంలో మాస్టర్ షేక్షావలి ఆచారి మాట్లాడుతూ జిల్లా సముదాయానికి అందరికి అందుబాటులో ఉండే విధంగా అందరికీ ఆమోదయోగంగా స్థల పరిశీలనకు మద్దతుగా ఉంటామని DR SA సంపత్ కుమార్ ఆదేశాల తో కలెక్టర్ తో మాట్లాడి సాధ్య అసాధ్యాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని వీలైతే జిల్లా కోర్టు సముదాయానికి గద్వాల జిల్లా తరఫున ఒక డెలిగేట్స్ లాగా మంత్రిని కల్పించి జిల్లా కోర్టుకు కావలసినటువంటి స్థలాన్ని సమకూర్చే విధంగా సంపత్ కుమార్ సహకరిస్తారని సంపత్ కుమార్ ఆదేశాలతో మాస్టర్ షేక్షావలి ఆచారి మాట్లాడడం జరిగింది .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పాండురంగ పట్టణం బీసీ సెల్ అధ్యక్షుడు బసవరాజు పట్టణ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.