జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా శ్రీ టి శ్రీనివాస రావు ఐపిఎస్
జోగులాంబ గద్వాల 2 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు ఐపిఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎందరో కృషి,త్యాగాల వల్ల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బవించిందని, వారు కలలు కన్నా రాష్ట్రంగా అభివృద్ధి చెందుతూ రాష్ట్రం ముందుకు పోతుందని అన్నారు.సామాన్య ప్రజలలో భరోసా కల్పిస్తూ,ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందిస్తునామని అన్నారు.అధికారులు మరియు సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేసి జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం 2026 నూతన సంవత్సరం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవ పతకాలకు ఎంపిక అయినా SI చంద్రశేఖర్ -CCS( ఉత్తమ సేవ పతకం ), ఏ. ఎస్సై వెంకట ప్రసాద్ -మనో పాడ్ పోలీస్ స్టేషన్( సేవ పతకం), ప్రేమ్ కుమార్ - రాజోలి పోలీస్ స్టేషన్ (సేవ పతకం ) ఇటిక్యాల పోలీస్ స్టేషన్ ఎస్సై రవి కు (సేవ పథకం )జిల్లా ఎస్పీ సేవ పతకాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్ డి . ఎస్పీ శ్రీ వై.మోగిలయ్య ,సాయుధ దళ డి.ఎస్పీ నరేందర్ రావ్, కార్యాలయ ఏ ఓ సతీష్ కుమార్, గద్వాల్ సి ఐ టంగుటూరు శ్రీను,అర్. ఐ లు వెంకటేష్, నరేష్, హరీఫ్ లు, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సై లు, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.