జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో. సిబ్బంది లేక ఇబ్బందులు.

అనుకున్నంత ఆదాయం రావడం లేదు.

Jun 10, 2026 - 19:50
Jun 10, 2026 - 21:42
 0  0
జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో. సిబ్బంది లేక ఇబ్బందులు.

జోగులాంబ గద్వాల 10 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో తగినంత సిబ్బంది లేక కిందిస్థాయి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యము రైతుల అవసరాలు తీర్చే జాతీయ మార్కెట్ యార్డులో జిల్లా అధికారి బదిలీ పై వెళ్లడంతో అధికారి పోస్ట్ ఖాళీగా ఉంది. జాతీయ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బదిలీపై వెళ్లడం వలన. ఇంచార్జి కార్యదర్శిగా అల్లంపూర్ మార్కెట్ యార్డు అధికారిని ఏర్పాటు చేయడంతో సమస్యగా మారింది. ఇక్కడ ముగ్గురు సూపర్వైజర్ ఉండాల్సి ఉండగా ఒక పోస్ట్ ఖాళీగా ఉండడం. ఉన్న ఇద్దరు ఒక సూపర్వైజర్ లాంగ్ లీవ్ పెట్టడం. పనిచేస్తున్న సూపర్వైజర్ కి అదనంగా భారం అయింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు అమ్మకాలు ప్రక్రియ. ట్రేడర్స్లు కమిషన్ ఏజెంట్లు గద్వాల జాతీయ వ్యవసాయ మార్కెట్ లో సుమారు 200 మంది ట్రేడర్స్ ఏజెంట్లు కమిషన్ దారులు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం దీనితో మార్కెట్కు రోజుకు లక్షల్లో ఆదాయం వస్తుంది. వీటిని సరిచూసి అధికారి లేకపోవడం వలన. ఇన్చార్జి కార్యదర్శి ఎప్పుడొస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. రైతులు నష్టాల్లోనూ మార్కెట్ ఏజెంట్లు కమిషన్ దారులు నుంచి రైతులు మోసే పోయే పరిస్థితి ఏర్పడింది. రోజు సుమారు సమీప గ్రామాల్లోని రైతులు తమ పంటను అమ్ముకునేందుకు నిత్యం మార్కెట్ యార్డ్ కు పండించిన పంటను తీసుకొని వచ్చి అమ్ముకొని పోయే పరిస్థితి ఉన్నది. కమిషన్ ఏజెంట్లు రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం అడిగిన కాడికి ఇచ్చే పరిస్థితి రైతుకు ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కాపాడుకునేందుకు గిట్టుబాటు ధర కల్పించిన. పూర్తిస్థాయిలో అమలు గాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి. వెంటనే అధికారులను ఏర్పాటు చేసి. మార్కెట్లోని ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరుతున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State