జర్నలిస్ట్ లు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం అభినందనీయం
వెన్నెల ఆస్పత్రి వైద్యులు డాక్టర్ నరేష్ మామిడి
సూర్యాపేట: జర్నలిస్ట్ లు వెన్నెల ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని వెన్నెల ఆస్పత్రి వైద్యులు డాక్టర్ నరేష్ మామిడి, వైదురాలు దివ్య, ఆసుపత్రి నిర్వాహకులు బయ్య దయాకర్ లు అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించి ఈసీజీ, బీపీ, షుగర్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్లో ఆదివారం వారు ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ప్రభుత్వాలు మార్చే శక్తి జర్నలిస్టులకు ఉందని, నిరంతరం వార్తా న్యూస్ కవరేజ్ కొరకు వెళుతుంటారని కాబట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలను స్క్రీనింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలను గుర్తించి నయం చేసే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. టి యు డబ్ల్యూ జె, ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యులు మిక్కిలినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయటం శుభపరిణామమని అన్నారు. టి యు డబ్ల్యూజె ఐజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ఎలాంటి వేతనాలు లేకున్న జీవితాలను పణంగా పెట్టి ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల కు వెన్నెల ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆసుపత్రి నిర్వాహకులకు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మంచి ఫిట్నెస్ కలిగి ఉండాలని కోరారు. టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా 24 గంటలు ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు వైద్య శిబిరం ఏర్పాటు మంచి ఆలోచన అని తెలిపారు. కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే 143 జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య యాదవ్, సీనియర్ జర్నలిస్టు, జహంగీర్ సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాసరెడ్డి, బచ్ఛు పురుషోత్తం, వెంకట్ రెడ్డి, ఉయ్యాల నరసయ్య గౌడ్, గుంటి శ్రీను, పెనుగొండ మల్లికార్జున్, కొండ్లె కృష్ణయ్య, తండు వెంకన్న గౌడ్, దోసపాటి అజయ్ కుమార్, వాసా చంద్రశేఖర్, జహీర్, శ్రీనివాస్, సుమన్, రమేష్, సూర్య,వెన్నె ల ఆస్పత్రి సిబ్బంది నాగరాజు, మధు,చైతన్య, రియాజ్, రేష్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలను అందించినందుకు డాక్టర్లను ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు ఎవరికైనా వెన్నెల ఆసుపత్రిలో ఓపి ఫీజు లేకుండా ఉచితంగా చూస్తామని డాక్టర్ నరేష్ నిర్వాకులు దయాకర్ హామీ ఇచ్చారు.