జర్నలిస్టు రమణ పార్థివ దేహానికి నివాళులర్పించిన
జెడ్పిటిసి జీడి బిక్షం
రమణ భార్యకు ఆర్థిక సహాయం అందజేసిన జెడ్పిటిసి
సీనియర్ పాత్రికేయులు మాడుగుల రమణ ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలుసుకొని సూర్యాపేట జెడ్పిటిసి జీడి బిక్షం రమణ సొంత గ్రామం సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామానికి చేరుకొని రమణ పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రమణ భార్యకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి జీడి బిక్షం మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా రమణతో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు.వివాదాలకు తావులేని మంచి జర్నలిస్టుగా రమణ కొనసాగారని అలాంటి జర్నలిస్టు మృతి చెందడం బాధాకరమైన విషయం అన్నారు