జర్నలిస్టుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

చర్ల ఏప్రిల్ 27
చర్ల మండల కేంద్రంలో భూ ఆక్రమణ పై వార్తా సేకరణకు వెళ్ళిన చెన్నం పవన్ కుమార్ జర్నలిస్ట్ పై తప్పుడు ఆరోపణలు చేసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ విలేకరులు డిమాండ్ చేసారు. చర్ల మండలం సాయి నగర్ కాలనీలోని కన్యకా పరమేశ్వరి ఆలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్న వారి గురించి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో విచారణ నిమిత్తం ఫిర్యాదుదారులతో కలిసి రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ సమాచారాన్ని వార్తగా మలిచేందుకు అక్కడికి వెళ్లి ఆర్ఐ విచారిస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ విలేఖరి చెన్నం పవన్ కుమార్ ఒక బట్టల షాపు వద్ద ఉంటే సాయంత్రం పట్ట పగలు షాపులో నుండి బయటకు లాగి, కబ్జాదారులు తప్పుడు ఆరోపణలు చేసి దాడి చేయడం వారి బరితెగింపు తనానికి నిదర్శనమని అన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే వారు అబద్ధపు ఆరోపణలు చేసి విలేకరులపై కూడా దాడికి వెనుకాడడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులను శిక్షించాలని చర్ల మండల జర్నలిస్టులు కోరారు.