జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
ఇటిక్యాల మండల కేంద్రంలో ఘనంగా రిజర్వేషన్స్ దినోత్సవం.
చత్రపతి సాహు మహారాజుకు నివాళి అర్పించిన బీఎస్పీ నాయకులు .
జోగులాంబ గద్వాల 26 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపొగు రాంబాబు అన్నారు. ఇటిక్యాల మండల కేంద్రంలోని అంబెడ్కర్గు చౌరస్తాలో గురువారం రిజర్వేషన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ 151వ జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వము జనాభా లెక్కలను చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించాలన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేపట్టిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ లను విడుదల చేయాలన్నారు. రిజర్వేషన్లను పెంచకుండా కాలయాపన చేయడం తగదని అన్నారు.EWS రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ.. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లను పెంచడం లేదన్నారు. భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను పరోక్షంగా కేంద్ర ప్రభుత్వము రద్దు చేయాలని కుట్రలు పడుతుందన్నారు. దేశంలోని బహుజన సమాజం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాబు, జమ్మన్న ,యోబు , దానం, జేమ్స్, జానయ్య, ఆనందము, అబ్రహాము, రాజు, ప్రవీణ్, రామకృష్ణ ,సూరి, కోళ్ల శంకర్, జీవరత్నము తదితరులు పాల్గొన్నారు.