చౌళ్ళరామారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మందకృష్ణ మాదిగ

అడ్డగూడూరు 25 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామారం గ్రామంలో భారతరత్న డాక్టర్" బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. వారితోపాటు ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న,విగ్రహ దాత కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి శ్రీరాముల జ్యోతి అయోధ్య, మాజీ ఎంపిటిసి దర్శనాల అంజయ్య,మోత్కూర్ మార్కెట్ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్,గ్రామ అంబేద్కర్ సంఘ నాయకులు,మందుల కిరణ్,తలపాక మహేష్, నాయకులు,కళాకారులు,వివిధ గ్రామాల ఎంఆర్పిఎస్ నాయకులు యాదగిరి,రాజు,సతీష్ గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.