చౌటుప్పల్ లో జరిగే సిపిఎం 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్

భువనగిరి 12 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- డిసెంబర్ నెల15,16,17 తేదీలలో చౌటుప్పల్ లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు వనం ఉపేందర్ అన్నారు.అదేవిధంగా 15న చౌటుప్పల్ పట్టణంలో జరిగే గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయాలని గురువారం రోజు భువనగిరి పట్టణ సంటర్ల ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల కెరటం పోరాటాల సారధి సిపిఎం జిల్లా మూడవ మహాసభల సందర్భంగా 15వ తారీఖున చౌటుప్పల్ పట్టణంలో గొప్ప బహిరంగ సభ జరుగుతుందని దీన్ని వికులాంగులు కార్మికలు, కర్షకులు, పేదలు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు అదేవిధంగా 16,17న ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. నిరంతరం పేదలు వికులాంగుల కార్మికులు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించిందని అనేక చోట్ల పేదల ఇళ్లస్థలాల కోసం రేషన్ కార్డుల కోసం వృద్దులు వికలాంగుల వితంతుల పెన్షన్లు కోసం కూలి రేట్ల కోసం ఇతర హక్కుల కోసం నిర్వహించిన పోరాటాలను ఒకసారి నెమరు వేసుకొని భవిష్యత్తు మూడు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహించవలసిన పోరాటాలను నిర్మించుకునే లక్ష్యంతో ఈ మహాసభ లు జరుగుతున్నాయని భవిష్యత్తులో పేదల ఇండ్ల ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు అమలు చేయాలని అనేక సమస్యలపై ఈ మహాసభలో పలు తీర్మానాలు ఆమెదు ఇచ్చాటటు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ బొల్లపెల్లీ స్వామి కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు.