చేనేత కార్మిక కుటుంబానికి ఆర్థిక సహాయం

Apr 14, 2026 - 18:35
Apr 14, 2026 - 18:35
 0  2
చేనేత కార్మిక కుటుంబానికి ఆర్థిక సహాయం

జోగులాంబ గద్వాల 14 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జయరాములు (65) తండ్రి పేరునర్సప్ప చేనేత కార్మికుడు రాఘవేంద్ర కాలనీ గద్వాల్ మగ్గం నేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న క్రమంలో తనకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉందని డాక్టర్స్ నిర్దారణ చేసారు. ఈ క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ రావడానికి చాలా హాస్పటల్ లకు తిరిగానని చివరికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ కు వెళ్ళినప్పుడు ఆ వ్యాధి నిర్ధారణ కావడం జరిగింది. చాలాకాలంగా హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల చాలా డబ్బు ఖర్చయింది తను చేస్తున్న చేనేత వృత్తి ఆగిపోవడంతో కుటుంబ పోషణ అలాగే తన హాస్పిటల్ ఖర్చులకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉందని ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కూడా డబ్బులు అవసరమని సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ ను హాస్పిటల్ ఖర్చుల నిమిత్తమై రిక్వెస్ట్ చేయడం తొ ఆయనను పరామర్శించి  సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ ద్వారా రూ.34000-లు చందు మురళి బెంజిమాన్ అశోక్ అందజేయడం జరిగింది.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State