ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Jan 26, 2025 - 21:42
Jan 26, 2025 - 21:43
 0  8
ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


జోగులాంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.


ఎర్రవల్లి. మండల కేంద్రంలోని:-76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిఎసిఎస్ పుటాన్ దొడ్డి సంఘం ఆవరణలో సంఘం చైర్మన్ డిసిసి బ్యాంక్ డైరెక్టర్  రంగారెడ్డి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అంటే భారతదేశానికి 1947 వ సంవత్సరం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అన్ని హక్కులు కల్పించుకోవడం కోసం భారత రాజ్యాంగం అవసరం కనుక రాజ్యాంగం రాయడం కొరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కృషి ఎంతైనా ఉంది అంటూ విద్యార్థులకు తెలియపరిచారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మన్ గా డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని రాయడం కొరకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకున్నారు దీన్ని రాయటం కొరకు పట్టిన కాలపరిమితి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది అని అందుకోసం ఆ రోజు భారత రాజ్యాంగం అమలుపరచిన రోజున స్వేచ్ఛ వాయువులు భారతదేశంలో సంచరించుకోవాలి అంటే మన అందరి నడవడిక భారత రాజ్యాంగం పట్లనే నడవాలి అంటూ  అర్థమయ్యే  రీతిలో రైతులకు ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది.   76వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రైతులు  సీఈఓ శ్రీనివాసరెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State