ఘనంగా జరిగిన శ్రీ శ్రీ శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి మహోత్సవాలు
జోగులాంబ గద్వాల 1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల పట్టణంలో శ్రీశ్రీశ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి మహోత్సవం పద్మశాలీలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మాఘశుద్ధ తదియలు శనివారం ఉదయం 6:30 గంటలకు భక్త మార్కండేయ స్వామి వారికి అభిషేకము, అర్చన, మహా మంగళహారతి పూజలు నిర్వహించి భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేశారు. అనంతరం సమస్త పట్టణ పద్మశాలి కుల బంధువులు, బంధుమిత్రులు కలిసి పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు నామాల శ్రీకాంత్ వారి కమిటీ ఆధ్వర్యంలో ,పద్మశాలీయ పతాకావిష్కరణ గావించారు. ఉదయం ఒంటిగంటకు భక్త మార్కండేయ స్వామి వారి శోభ యాత్ర అంగరంగ వైభవంగా పద్మశాలి మహిళా మణులు కోలాటాలతో, భజనలు, మంగళ వాయిద్యాల మధ్యలో రాజా వీధి నుండి రాతి బురుజు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వరకు శ్రీ భక్త మార్కండేయ స్వామి శోభయాత్ర పద్మశాలీలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పులిపాటి వెంకటేష్, పట్టణ పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షులు మహంకాళి శ్రీనివాసులు, దామ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి చిలివేరి సాయిబాబా, చిలువేరి సురేష్, మంత్రి సురేష్, దూడెం శ్రీనివాసులు, అక్కల శ్రీనివాసులు , పుట్ట శ్రీనివాస్ ఆర్య, పి. కృష్ణ, శాఖ యాదగిరి, ఏరువ రామస్వామి, గద్వాల పట్టణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు అక్కల కుమార్, చిలువేరి వెంకటేష్ ,మహంకాళి శ్రీధర్, సూర శ్రీధర్, చిలువేరి రాకేష్, ఏరువ పరుశురాం , పట్టణ పద్మశాలి మహిళలు ,పట్టణ పద్మశాలి కుల బంధువులు పాల్గొని విజయవంతం చేశారు.