ఘనంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

Jul 23, 2026 - 21:53
Jul 23, 2026 - 23:11
 0  2
ఘనంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

 తిరుమలగిరి 24 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు  చామల కిరణ్ కుమార్ రెడ్డి  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ రెడ్డి పేదల పెన్నిధి అని తన పార్లమెంటు పరిధిలోని సమస్యలను పరిష్కరించడం కోసం నియోజక వర్గాలల్లో తనదైన ముద్రవేస్తూ ఏదైనా ఆపద వస్తే అన్న అంటే నేను ఉన్నా అని చెప్పి పార్టీ కార్యకర్తల్లో మనో ధైర్యం నింపే మహోన్నత నాయకుడని కొనియాడారు.   జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దారూరి యోగానంద చార్యులు మాట్లాడుతూ  ప్రియతమా నేత భువనగిరి పార్లమెంట్ సభ్యులు గుండె దైర్యం గల్లా నాయకుడని ప్రజా సంక్షేమ కోసం రాజీలేని పోరాటం నాయకుడని కొనియాడారు . తదనంతరం బాణాసంచా పేల్చి, కేక్ కోసి సంబరాలను జరుపుకొన్నారు.  ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య, tpcc రాష్ట్ర నాయకులు పర్రెపాటి యుగంధర్ తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి మండలాల అధ్యక్షులు ఎల్సొజు నరేష్, తోడుసు లింగయ్య, మోరపాక సత్యం,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర యాదగిరి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి