గ్రూప్ 1లో సత్తాచాటిన చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన యువతి గొర్ల సుమశ్రీ

వనపర్తి 12 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలను ప్రకటించింది. ఎన్నో అవాంతరాల తరువాత ఎట్టకేలకు గ్రూప్ 1 ఫలితాలు విడుదలవ్వడంతో.. అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. 563 గ్రూప్ 1 పోస్టులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. గతేడాది ఆక్టోబర్ లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష్లలకు 21,093మంది అభ్యర్థుల హాజరయ్యారు. ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి ఆ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్ఫత్తిలో తుది జాబితా వెల్లడించనుంది.వనపర్తి జిల్లా గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న చిమన గుంటపల్లి గ్రామానికి చెందిన గొర్ల సుమశ్రీ .. 475.5 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు గొర్ల కృష్ణయ్య గొర్ల సంతోషమ్మ ప్రోత్సాహంతో కుటుంబ సభ్యుల సహకారంతో మార్కులు సాధించినట్లు తెలిపింది.