గ్రామ సభలలో అధికారులపై ఆగ్రహం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్: గ్రామ సభలలో అధికారులపై ఆగ్రహం ఆత్మకూర్ ఎస్. ప్రభుత్వం చేపడుతున్న నాలుగు సంక్షేమ పథకాలపై మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామసభలు బుధవారం జరిగాయి. మండలం లో నీ మక్తా కొత్త గూడెం,రామన్నగూడెం, అశ్లా తండా, సెట్టిగూడెం ,పాత సూర్యపేట, దుబ్బతoడ, కొత్త తండ, బోరింగ్ తండ , గ్రామాల్లో గ్రామసభ లు నిర్వహించారు.కాగా గ్రామ సభలు పాల్గొన్న ప్రజలు ప్రధానంగా అర్హులకు ఇలా జాబితాలో పేర్లు లేవని అనర్హులు ఉన్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కొన్ని గ్రామాలలో పింఛన్, మహిళ ఆత్మీయ భరోసా విశాలపై అడిగినప్పటికీ మొదటి రోజు అన్ని గ్రామాలలో అధికారుల పై మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ మండలాధికారులు తాసిల్దారు హరిచంద్ర ప్రసాద్ ఎంపీడీవో హసీమ్ వ్యవసాయ అధికారిని దివ్య సూపర్నెంట్ వెంకటాచారి, ఎంపీఓ రాజేష్ ,వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.