గౌడ సంఘం క్యాలెండర్ల ఆవిష్కరణ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ ఆత్మకూర్ ఎస్.. గౌడ్ లకు పెండింగ్ ఎక్స్ప్రెస్ వెంటనే ఇవ్వాలని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచాలని రెండు లక్షలు పింఛన్ ను నాలుగు లక్షలకు పెంచాలని గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలికట్ట విజయకుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని నసీంపేట లో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ్ లకు తాటి చెట్టు ఎక్కే ప్రతి గౌడ్ కి 18 సంవత్సరాలు నిండగా ఐడి కార్డులు ఇవ్వాలని ప్రతి జిల్లా కేంద్రం లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని తాటి చెట్టు ఎక్కే ప్రతి ఒక్కరికి సేఫ్టీమోకుల కిట్టు ఇవ్వాలని ఆయన అన్నారు. తదనంతరం దంతూరి సోమన్న మాతృమూర్తి దంతూరి గౌరమ్మ దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి తర్వాత కంటమ మహేశ్వర స్వామి సన్నిధిలో క్యాలెండర్ ఆవిష్కరణ చేసినారు. జిల్లా అధ్యక్షులు బుచ్చయ్య గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిత్తలూరు నారాయణ గౌడ్ తాడూర్ లింగయ్య గౌడ్, తాడూరు సైదులు గౌడ్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, పోలుమల్లో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు జలగం మల్లేష్ గౌడ కులస్తులు పాల్గొన్నారు.