గూడెం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
27-03-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో శ్రీ సీతారాముల దేవస్థానంలో అంగరంగవైభవంగా సీతారాముల కల్యాణం.
దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డ బిచ్చన్న, మేకల సతీష్ అధ్యక్షతన శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట బాలకృష్ణ సలహాదారునిగా ముందుండి కళ్యాణాన్ని జరిపించారు.
శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తుల సాక్షిగా అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు. శుక్రవారం గూడెం శ్రీ సీతారాముల ఆలయం యందు ఏర్పాటు చేసిన కల్యాణ మండపాల్లో సీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి.. రాములవారితో సీత మెడలో తాళి కట్టించారు. ఈ కమనీయమైన వేడుకను చూసి భక్తు లు తరించిపోయారు. సర్పంచ్ వెంకట్ రెడ్డి & జయశ్రీ రాములవారి సైడు కూర్చోగా, జనార్ధన్ & నిర్మల దంపతులు సీతమ్మ సైడు కల్యాణంలో కూర్చుని కళ్యాణం జరిపించారు... కల్యాణం అనంతరం దేవాదాయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ వేడుకలకు గ్రామంలో నూతనంగా ఏర్పడ్డ ఉప సర్పంచ్,వార్డ్ నెంబర్లు, ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది,గ్రామస్తులు, గ్రామ పెద్దలు,మహిళలు నాయకులు యువ నాయకులు, తదితరులు ప్రజలు హాజరయ్యారు.