గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

04 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ప్రార్ధన సమయాన్ని ఆకస్మికంగా పరిశీలనచేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, సమయానికి సరిగా విధులకు హాజరు కానీ ప్రిన్సిపల్ టీచర్లు వివరాలను అక్కడి పరిస్థితులను జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ కు రాష్ట్ర స్థాయి అధికారులకు విన్నవించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ విచారణకు జిల్లా స్థాయి అధికారులకు పంపారు, విచారణ జరిగిన అనంతరం వారు కలెక్టర్ నివేదిక అందించగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ప్రిన్సిపల్, 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట వాళ్లకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన , విధులను సరిగా నిర్వహించకపోయిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.