గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అద

Aug 29, 2026 - 21:48
 0  6
గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అద

 నపు కలెక్టర్ నర్సింగరావు.

 జోగులాంబ గద్వాల 29 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్. మండల పరిధిలోని గుడ్డందొడ్డి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, తాగునీరు, పరిశుభ్రత తదితర సౌకర్యాలను పరిశీలించారు. ప్రిన్సిపాల్, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అందించే ఆహారం నాణ్యతగా, పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వంటశాల, భోజనశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

తాగునీరు, వసతి గృహాలు, మరుగుదొడ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, విద్యార్థుల సంక్షేమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఈ తనిఖీలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333