గాలి కుంటూవ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

Apr 17, 2025 - 19:00
 0  14
గాలి కుంటూవ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
గాలి కుంటూవ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2020 ఐదు తెలంగాణ వార్త ప్రతినిధి: ఇటిక్యాల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నిర్వహించబడుతున్న ( fmd కంట్రోల్ ప్రోగ్రాం) గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో తేదీ 15 /4/ 2025 నుండి 14/ 5 //2025 వరకు నిర్వహించుటకు రాష్ట్ర పశువు సమర్థత శాఖ చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి గాలికుంటు నివారణ టీకాలు మూడు నెలల వయస్సుపైబడిన అన్ని పశువులకు వేయబడును. కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొండేరు మరియు ఇటిక్యాల గ్రామాల పశువులకు టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య మరియు పశువు సంవర్షకఅధికారి వెంకటేశ్వర్లు పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడిరైతులతో మాట్లాడుతూ వైరస్ సూక్ష్మజీవి వల్ల పశువులకు నోరు గిట్టల మధ్యల పుండ్లు ఏర్పడి అనతి కాలంలో గాలి ద్వారా వ్యాపించే వ్యాధి అందుకే దీన్ని గాలి కుంటూ వ్యాధి అని అంటారు . ఈ వ్యాధి సోకిన పశువులు ముడుచుకొని పండుకుంటాయి. జ్వరం అధికంగా 105 f పైబడి ఉంటుంది. నోరు నాలుక భాగంలో ఫుల్లు ఉండి మేత మెయవు. నెమరు వెయ్యవు పాల దిగుబడి తగ్గుతుంది. నోటి నుండి సొంగా లేక నురుగు వస్తు దగ్గుతాయి గెటల మధ్య ఎర్రబడి మెత్తబడి కుంటితాయి. వ్యాధి సోకున దూడలు 30 నుంచి 40% వరకు చనిపోతాయి. చూడి పశువులు ఇసుకపోయి రైతులకు ఆర్థికంగా తీవ్రం నష్టం వాటిల్లుతుందని రైతులకు అవగాహన కల్పించారు. కాబట్టి పాడి రైతులు తప్పకుండా తమ పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని పశువు సంపాదన కాపాడుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో( 80 తెల్ల పశువులకు గోవు జాతి కి) 186 గేదెలకు కి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి పశు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333