గర్భిణీ స్త్రీ జీవితాలతో చెలగాటమాడుతున్న జోగులాంబ సెంట్రల్ ల్యాబ్
జోగులాంబ సెంట్రల్ ల్యాబ్ విషయమై చూసి చూడనట్లు వదిలేస్తున్న జిల్లా వైద్యాధికారులు
జోగులాంబ గద్వాల 13 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఐజ .*పట్టణంలోని జోగులాంబ సెంటర్ ల్యాబ్ వారు తప్పుడు రిపోర్టులు ఇస్తూ గర్భిణీ స్త్రీ జీవితాలతో చెలగాటము ఆడుతున్నారు నిన్న 11వ తేదీ గర్భిణీ స్త్రీని పెయిన్స్ రావడంతో ఆశ వర్కర్ సహాయంతో ఐజ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ విషయమే అక్కడ డాక్టర్లు ఉమ్మనీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి స్కానింగ్ చేయాలని తెలుపగా గర్భిణీ స్త్రీతో కుటుంబ సభ్యులు జోగులాంబ సెంట్రల్ ల్యాబ్ కి వెళ్లి స్కాన్ చేయించారు అందులో రిపోర్టు 3.4 ఉమ్మనీరు ఉన్నట్లు ఇచ్చారు. ఇస్కాన్ ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ చూసి ఉమ్మనీరు చాలా తక్కువగా ఉంది డెలివరీ చేయడం కష్టం అంటూ జిల్లా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేశారు గర్భిణీ స్త్రీని తీసుకొని కుటుంబ సభ్యులు ఆశ వర్కర్ తో కలిసి జిల్లా ప్రభుత్వ ఆస్పటల్ వెళ్లగా అక్కడ ఉన్నటువంటి ఓ డాక్టర్ స్కాన్ పరిశీలించి ఉమ్మనీరు తక్కువగా ఉంది *సీజరిన్ చేయవలసి వస్తుందని అబ్జర్వేషన్ లో పెట్టారు అనంతరం డాక్టర్ ఉమ్మనీరు విషయమై అనుమానము గా ఉంది మరొకసారి మీరు వెళ్లి క్రాంతి డయాగ్నస్టిక్ సెంటర్లో స్కాన్ చేయాలంటూ తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు గర్భిణీ స్త్రీని తీసుకొని వెళ్లి స్కాన్ చేయించగా అక్కడ రిపోర్టులో 11.12 ఉమ్మనీరు ఉన్నట్లు రిపోర్టు వచ్చింది రిపోర్టును చూసిన డాక్టర్ మీ ఐజాలో ఇలాగా చేస్తారు ఇలాంటి తప్పుడు రిపోర్టుల వల్ల సీజరిన్ చేయవలసి వచ్చేది ఉమ్మనీరు తక్కువగా ఉన్న సమయంలో సీజరిన్ ఆపరేషన్ లో ఏదైనా సమస్యలు తలెత్తితే ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని ఆశ వర్కర్ ను కుటుంబ సభ్యులను చివాట్లు పెట్టారు. జోగులాంబ సెంటర్ లాబ్ ఇప్పటికే అనేకసార్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్న తూతు మంత్రంగా పర్యవేక్షణలు చేస్తూ సీజ్ చేస్తున్నామంటూనే మళ్లీ కొద్ది రోజులకు ఓపెన్ చేసుకునేలా పర్మిషన్లు ఇస్తున్నారు ఏది ఏమైనా జోగులాంబ సెంట్రల్ ల్యాబ్ విషయమై జిల్లా వైద్యాధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జోగులాంబ సెంట్రల్ ల్యాబ్ పై జిల్లా వైద్యాధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్దామని ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.