గర్భిణీ స్త్రీలకుతప్పని తిప్పలు

Aug 13, 2026 - 20:09
 0  1
 గర్భిణీ స్త్రీలకుతప్పని తిప్పలు

 జోగులాంబ గద్వాల 13 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశం మేరకు గవర్నమెంట్ హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీలడెలివరీల సంఖ్య పెంచాలని ఆదేశాలు ఉన్నవి  వారి ఆదేశం మేరకు ఇటిక్యాల మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఏప్రిల్ 2026 నుండి ఆగస్టు 12. 2026 వరకు గర్భిణీ స్త్రీల రిజిస్ట్రేషన్ అయిన వారి సంఖ్య  (369 ) ఇటిక్యాల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం లోడెలివరీ అయిన వారి సంఖ్య  సంఖ్య( 7) ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వారి సంఖ్య (166) గవర్నమెంట్ హాస్పటల్ లో డెలివరీ అయిన వారి సంఖ్య(163 ) పురుషుడు  స్టాఫ్ నర్స్ ఉండడం వలన ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీలు చేయించుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని గర్భిణీ స్త్రీల నుంచి వారి భర్తల నుంచి తల్లిదండ్రుల నుంచి  విమర్శలు ఉన్నాయి. 

మహిళ స్టాఫ్ నర్స్ ను హాస్పిటల్ లో ఉండేటట్టు చూడాలని గర్భిణీ స్త్రీలు వారి తల్లిదండ్రులు వారి భర్తలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటిక్యాల ప్రాథమిక వైద్యఆరోగ్య కేంద్రం ను  12 గంటల నుంచి 24 గంటలు వైద్యసేవలు అందే విధంగా  ఉండేటట్టు చూడాలని ఉన్నతాధికారులను మండలంలోని గర్భిణీ స్త్రీలు వారి తల్లిదండ్రులు భర్తలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333