గన్ని బ్యాగులు కూడా సరఫరా చేయలేని దౌర్భాగ్య స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్

Apr 23, 2026 - 19:48
 0  1

 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు తీవ్రమైన అవస్థలు

 పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 జోగులాంబ గద్వాల 23 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్. చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను సందర్శించి రైతులతో మాట్లాడారు. 

రైతులకు తక్షణమే గన్ని బ్యాగులు సరఫరా చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

* తరుగు పేరుతో అదనపు దోపిడిని అరికట్టాలి.

* మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలి.

ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ...

* అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో గత 20 రోజులుగా రైతులు మొక్కజొన్నలు తెచ్చి మార్కెట్ లో పోసుకున్నారని కొనుగోలు కేంద్రం ప్రారంభమై ఏడు రోజులు అవుతుందని అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల రైతులు రాత్రింబవళ్లు మొక్కజొన్నల కాడ కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిం అని అన్నారు.

* రైతులకు ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి పది రోజుల ముందే రైతులు మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రానికి తెచ్చారని లేటుగా ప్రారంభించడం వల్ల గత 20 రోజులుగా రైతులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 

* కొనుగోలు ప్రారంభమై కూడా ఏడు రోజులు అవుతున్నా సక్రమంగా పని జరగడం లేదని సర్వర్ సమస్యల వల్ల కంప్యూటర్లు పనిచేయడం లేదని, సరుకుకు సరిపడా గన్ని బ్యాగులు కూడా లేవని అని అన్నారు. ఇంకా లక్ష గన్ని బ్యాగులకు రైతులకు అవసరం ఉందని అన్నారు. వెంటనే గన్ని బ్యాగులు అవసరం ఉన్నాయని వాటిని వెంటనే తెప్పించాలని డిమాండ్ చేశారు. 

* గన్ని బ్యాగుల విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తి వేయడం దుర్మార్గమని అన్నారు. మార్క్ఫెడ్ వద్ద గన్ని కొరత కారణంగా రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వలేమని, రైతులు బయట కొనుగోలు చేసి కేంద్రాలకు మొక్కలు తీసుకురావాలని సూచించడంతో రైతులు గన్ని బ్యాగులు కొనుగోలు కోసం అవస్థలు పడుతున్నారు.

* రైతులు మార్కెట్లో 25/- రూపాయలకు గన్నీ బ్యాగు కొనుగోలు చేసి ధాన్యం ఎత్తితే, ప్రభుత్వ మాత్రం వారికి 15/- రూపాయలు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో రైతులు సంచి పై 10/- రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది అని అన్నారు.

* సీరియల్ ప్రకారం రైతులకు నుండి మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని అన్నారు. 

* కనీసం మార్కెట్ యార్డులో రైతులకు, హమాలీలకు తాగటానికి మంచినీరు కూడా లేదని. బోరు మోటారు చెడిపోయిందని వెంటనే బోరు రిపేరు చేయించాలని డిమాండ్ చేశారు.

* తాత్కాలికంగా ఫిల్టర్ వాటర్ తెప్పించి త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

* తూకం వేయటానికి కాంటాలు సరిపడా లేవని కేవలం నాలుగు మాత్రమే పని చేస్తున్నాయని ఇంకో పది దాకా రిపేర్ లో ఉన్నాయని వాటిని వెంటనే రిపేర్ చేయించాలని అదనంగా కొత్త వేయింగ్ మిషన్లను కూడా తెప్పించాలని డిమాండ్ చేశారు. 

* తరుగు పేరుతో 50 కేజీలకు అదనంగా ఒక కేజీ 900 గ్రాములు రైతు నుండి తీసుకుంటున్నారని పైగా హమాలి ఖర్చులతో పాటు అన్ని ఖర్చులు రైతే భరించాల్సి వస్తుందని తరుగు పేరుతో అదనంగా మొక్కజొన్నలను తీయడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. 

* రైతులతో కలిసి అక్కడినుండి డిస్టిక్ మార్క్ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వివరించారు

* మొక్కజొన్నల కొనుగోలు సెంటర్ల విషయంలో జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో రైతులు మొల్కసీమ రంగస్వామి, కోర్విపాడు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, చేన్నిపాడు సూరి, నక్కలపల్లి జైపాల్ రెడ్డి, జానకిరాముడు,కోర్విపాడు శివరాం రెడ్డి,రామన్న, లక్ష్మిదేవి, లక్సమన్న, పుల్లారెడ్డి, ఈ నాగేశ్వర్ రెడ్డి, ఆవుల మద్దిలేటి, పరుశరాముడు, కోటీశ్వర్ రెడ్డి, పెద్ద లక్సమన్న, నడిపి శేషి, హనుమంత్, రాజు ఈదన్న పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333