గద్వాల ఎమ్మెల్యే మీపార్టీ ఏది...?

- మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్పాలి? గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీ?
-BRS పార్టీ నుండి ఫిరాయింపుతో అనర్హత వేటు భయంతో గద్వాల ఎమ్మెల్యే "హైడ్రామా"...!
- స్థానిక ఎమ్మెల్యే నిజస్వరూపం జిల్లా ప్రజలు గ్రహించాలి...
- NHPS జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో....
- NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్...
జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల: నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓటు వేసి గెలిపించిన ప్రజలను అభివృద్ధి పేరుతో అనేక రకాలుగా మోసం చేస్తున్నారని గద్వాల నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుతో హైడ్రామా చేస్తున్నారని మీరు ఏ పార్టీలో ఉన్నారో బహిరంగంగా మీడియా ముందు ప్రజలకు తెలియజేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....
గద్వాల జిల్లా ప్రతిష్టను, రాష్ట్ర వ్యాప్తంగా భంగపరిచి, గంగపాలు చేసేలా స్థానిక ఎమ్మెల్యే హైడ్రామా రాజకీయాలు చేస్తున్నారని, సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే రాజకీయ డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తూ బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, కావాలని దురుద్దేశంతో నా ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో వేస్తున్నారని, ఈనెల 11వ తేదీన గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. మీరు నిజంగా బిఆర్ఎస్ పార్టీలో కనుక ఉంటే నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని మీడియా ముందు ఎందుకు మాట్లాడటం లేదని, నిజంగా మీరు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లయితే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన "దీక్ష దివస్" కార్యక్రమానికి మరియు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే హైడ్రామాలను గుర్తించాలని, జిల్లాలో బహుజన నాయకత్వం ఎదగనీయకుండా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారని, గద్వాల ఎమ్మెల్యే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో లేదో ప్రకటన ఇవ్వాలని తెలిపారు.
ఈనెల 11వ తేదీన గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో స్వయంగా నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో నా ఫోటోలను వేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంతకం చేయకుండానే ఫిర్యాదు చేసిన ఘటన వెనుక అంతర్యమేమిటో అర్థం కావడం లేదని పార్టీలతో పాటు జిల్లా ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల గురించి ఆలోచన చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరాడా లేదా బహిరంగంగా ప్రజలకు చెప్పాలని,ఒక జేబులో బీఆర్ఎస్ పార్టీ కండువా, మరొక జేబులో కాంగ్రెస్ కండువా పెట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. అవకాశం వచ్చినప్పుడు రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చని అన్నారు. గద్వాల స్థానిక ఎమ్మెల్యే మీ పార్టీలో చేరనట్లయితే మా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, గద్వాల నియోజకవర్గంలో బంగ్లా బండ్ల లకువ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక బీసీలకు టికెట్ ఇస్తే గెలుస్తారని తెలిసి, స్థానికేతరులకు టికెట్ ఇచ్చి బహుజన వాదాన్ని మంటగలిపిన నిజమైన ద్రోహి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.
నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీనుండి పోటీచేసిన నాయకత్వానికి ప్రధాన బాధ్యతలు అప్పజెప్పడానికి ఎందుకు చొరవ చూపడం లేదని అన్నారు.
గద్వాల నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎవరు ఫ్లెక్సీలు వేశారో, వేసినా వ్యక్తులు ఎవరో ఏ పార్టీ వాళ్లు వేశారో, వాళ్లు నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల కాదా అనే విషయాన్ని పూర్తి వివరాలు తెలియకుండా ఎమ్మెల్యే సంతకం లేకుండానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి కోసం, పార్టీలో చేరానని గ్రామాల్లో ఉన్న ప్రజలను కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తూ, ఇంకో నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుతో వేసిన కేసును ఎదురుకోలేక ఉప ఎన్నికలు వస్తే వాటిని ఎదుర్కోలేమనే భావనతో ఆడుతున్నటువంటి నాటకమే గద్వాల ఎమ్మెల్యే హై డ్రామా రాజకీయం తప్పా వేరే ఏమి కాదని తెలిపారు. దమ్ముంటే ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధపడాలని అన్నారు
మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ఎంపీ మల్లు రవి గద్వాల ఎమ్మెల్యే మీ పార్టీ వ్యక్తి కానప్పుడు పదేపదే ఇంటికి వెళ్లి రావడం కారణమేమిటో ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల భయంతోనే రాష్ట్రవ్యాప్తంగా ఆడుతున్న నాటకంలో భాగంగా ఈ ప్రక్రియ అని అన్నారు
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు రంగస్వామి, గద్వాల పట్టణ నాయకులు గౌని శ్రీనివాస్ యాదవ్, మల్దకల్,గట్టు ధరూర్ మండల అధ్యక్షులు బి.విష్ణు, బలరాం నాయుడు, నెట్టెంపాడు గోవిందు, మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, అడవి ఆంజనేయులు, మల్దకల్, నాయకులు మీసాల కృస్టన్న, కె.పి. రామకృష్ణ, వెంకటేష్, లక్ష్మన్న, సర్వేష్, తదితరులు పాల్గొన్నారు.