గత నెల లో ఇల్లు కాలిన బాధిత కుటుంబానికి చేయూత
కళావతి స్వచ్ఛంద సహాయం.
ములుగు జిల్లా బ్యూరో
సెప్టెంబర్ 22 (తెలంగాణ వార్త):
మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామానికి చెందిన రెబ్బల రాములు, రమ దంపతుల ఇల్లు గత నెలలో కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా
పూర్తిగా కాలి బూడిదయింది. విషయం తెలుసుకున్న తిమ్మంపేట గ్రామానికి చెందిన కళావతి వెల్ఫేర్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు చిలుక మర్రి కళావతి ఆదివారం కొత్త మల్లూరు గ్రామానికి వెళ్లి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి 25 కేజీల బియ్యం, ప్లేట్స్, పల్లాలు, బెడ్ షీట్స్, చీరెలు, దోమ తెరలు అంద చేశారు. కళావతి వెల్ఫేర్ స్వచ్ఛంద సేవా సంస్థ గత 15 సంవత్సరాలుగా ప్రజాసేవే ధ్యేయంగా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ అర్థిక చేయూతనందించి, ఎన్నో సేవ, సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమం లో నిర్వాహకులు చిలుకమర్రి కళావతి, శివ, జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.