గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై  అవగాహన సదస్సు

Jun 22, 2026 - 19:23
 0  1
గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై  అవగాహన సదస్సు

అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం జూన్ 26 సందర్భంగా జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ కేంద్రంలో 60 ఫీట్ల రోడ్డు నందు గల జయ జూనియర్ కళాశాల  నందు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సిఐ వెంకటయ్య హాజరై డ్రగ్స్ నిర్మూలన, గంజాయి నిర్మూలన పట్ల విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం జూన్ 26 సందర్భంగా మండల పరిధిలో వారం రోజులపాటు డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థి దశ నుంచే గంజాయి లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసే వ్యసనాల బారిన పడకూడదని పిలుపునిచ్చారు.  గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు. గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలు  వాడినా, విక్రయించినా లేదా రవాణా చేసినా చట్టపరంగా ఎదురయ్యే కఠినమైన శిక్షలను హెచ్చరించారు. 

విద్యార్థులు కేవలం చదువు, క్రీడలపైనే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఎవరైనా మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు డయల్ 100, 112 కు, తెలంగాణ రాష్ట్ర ఈగల్ పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1908 కి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడుతాయని తెలిపారు. మత్తుపదార్థాల రహిత సమాజ స్థాపనకు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా యాంటీ డ్రగ్స్ సోల్జర్ సెల్ఫీ స్టిక్.. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో యాంటీ డ్రగ్ సోల్జర్ సెల్ఫీ స్టిక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు మేము సైతం మాదాకద్రవ్యాల నిర్మూలన సైనికులుగా ఉంటామని సెల్ఫీ స్టిక్ వద్ద ఫోటోలు దిగి పేర్లు నమోదు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM), ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333