గంజాయి కలకలం యువకులు అరెస్ట్

మోత్కూర్ 29 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
మోత్కూర్ మున్సిపల్ పరిధిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు వెలుగులోకి రావడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం మోత్కూర్ పట్టణంలోని నార్కెట్పల్లి రోడ్డుపై పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ముగ్గురు యువకులు గంజాయితో పట్టుబడ్డారు. మరో యువకుడు పరారయ్యాడు.పట్టుబడిన వారిని మోత్కూర్‌కు చెందిన కోలా దినేష్ (27), జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన బుర్కా సాయి (25), గుండాల మండలం గంగాపురం గ్రామానికి చెందిన ఆవుల భరత్ (21)లుగా పోలీసులు గుర్తించారు. పరారైన వ్యక్తిని బొంతు రాము అని గుర్తించారు.వాహన తనిఖీ సమయంలో ఇద్దరు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఈ నలుగురి వద్ద నుంచి మొత్తం 90 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించడమే కాకుండా విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.ఈ ఆపరేషన్‌లో ప్రొబేషనరీ ఎస్సై నోయల్ రాజు, కానిస్టేబుళ్లు హుస్సేన్, మహేష్, శ్రీనివాస్, ఖదీర్‌లు పాల్గొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. నాగరాజు తెలిపారు. పరారీలో ఉన్న బొంతు రామును పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు....