ఖమ్మం నగరంలో ఆగస్టు ఏడో తారీఖున "అక్రమ ర్యాలీపై "ఖమ్మం ఏసీపి కి ఫిర్యాదు చేసిన"రాష్ట్ర బిజెపి నాయకులు దేవకి వాసుదేవరావు

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ : ఖమ్మం నగరంలో ఆగస్టు 7, 2025న నిర్వహించబడిన *అక్రమ ర్యాలీపై బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ రావు ఖమ్మం ఎసిపి కి ఫిర్యాదు నమోదు చేశారు.
తన ఫిర్యాదులో, ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పాఠశాల చిన్నారులను — ముఖ్యంగా NCC మరియు NSS యూనిఫాంలు ధరించిన విద్యార్థులను — వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా, అధికారుల అనుమతి లేకుండా “పాలస్తీనా”కు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొనడానికి ప్రేరేపించారని అక్రమ ర్యాలీపై బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ రావు గారు ఖమ్మం ఎసిపి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది
ఈ ర్యాలీ ద్వారా:
1. మతాల మధ్య విభేదాలు ప్రోత్సహించబడి, ప్రజా శాంతి భద్రతకు భంగం కలిగించబడింది.
2. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే విదేశీ శక్తులకు మద్దతు తెలుపబడింది.
3. చిన్నారులను రాజకీయ మరియు విదేశీ ప్రోపగాండా పావులుగా ఉపయోగించడం జరిగింది.
ఈ కార్యక్రమం వెనుక తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మరియు కొందరు వ్యక్తులు ఉన్నారని, వీరిలో శ్రీ నున్న నాగేశ్వరరావు, శ్రీ మొహమ్మద్ మౌలానా, శ్రీ యలమంచలి రవీంద్రనాథ్ వంటి వారు ప్రసంగాలు చేసి సామాజిక ఉద్రిక్తత రేకెత్తించే ప్రయత్నం చేశారు..
పోలీసులను ఆయన కోరిన చర్యలు:
➡️ ఈ ఘటనపై FIR నమోదు చేయడం.
➡️ నిర్వాహకులు, ఆర్థిక సహకారదారులు, మద్దతుదారులపై విస్తృత దర్యాప్తు జరపడం.
➡️ NCC/NSS యూనిఫాంలను అనుమతి లేకుండా ఉపయోగించిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం.
➡️ మైనర్లను ఉపయోగించిన పాఠశాలలు, సంఘాలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం.
ఈ ఘటన చిన్నారుల మానసిక వికాసానికి మరియు జాతీయ సమగ్రతకు ముప్పుగా మారుతుందని, దోషులను శిక్షించకపోతే ఇలాంటి విభజన కృషులు మరింత పెరుగుతాయని హెచ్చరిస్తూ... ఈ చర్యలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని లేనియెడల మా పోరాటం ఉదృతం చేస్తామని తెలియజేస్తున్నాను..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర రావు,పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నున్న రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ్ ప్రతాప్, గెంటెల విద్యాసాగర్, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అంజయ్య, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..