క్షయ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి
సూర్యాపేట: క్షయతో బాదపడే వారు జాగ్రత్తలు పాటిస్తే ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద నుండి డిఎంహెచ్వో డాక్టర్ పెండెం వెంకటరమణ తో పాటు వారు జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం క్షయ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందన్నారు. లక్షణాలు ఉన్న వారు వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నివారణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 4,0009 మందికి టీబీ పరీక్షలు చేయగా 1741 మంది టీబీ వ్యాధి ఉన్నట్టుగా గుర్తించామని, 1186 మందికి చికిత్స పూర్తయిందని, ఇంకా 500 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. 2026 నాటికి టీబీ వ్యాధిగ్రస్తులు లేకుండా చూడడమే మా ద్యేయం అన్నారు.టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం వెయ్యి రూపాయల పౌష్టికాహారం కొరకు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ పాపిరెడ్డి డాక్టర్ శ్రీశైలం ఉపేందర్ డిప్యూటీ డెమో ఆఫీసర్ వి సంజీవరెడ్డి, మెడికల్ ఆఫీసర్ జి వాసవి, వందన, శ్రీశైలం, శ్రీదేవి, సోని, రాము తదితరులు పాల్గొన్నారు.