క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం

Jul 18, 2026 - 11:22
 0  1
క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం

 డెబిట్ కార్డు సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. త్వరలో పంపిణీ ప్రారంభం

సూర్యాపేట జిల్లా ప్రతినిధి | 18-07-2026 | ప్రజా న్యూస్ నెట్‌వర్క్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజా న్యూస్ నెట్‌వర్క్ కథనం ప్రకారం డెబిట్ కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే జిల్లాలకు చేరాయి. కార్డుపై కుటుంబ యజమాని ఫొటో, పేరు, చిరునామాతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలను ముద్రించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే లబ్ధిదారుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, తీసుకున్న రేషన్ వివరాలు వెంటనే అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రజా న్యూస్ నెట్‌వర్క్ సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1.05 కోట్ల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి.

???? ప్రజా న్యూస్ నెట్‌వర్క్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333