కోటమర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమం

అడ్డగూడూరు 17 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి శుక్రవారం రోజు బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పిహెచ్ఎస్ బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు కే రాజ్యవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని గ్రామ పంచాయతీ కూడలిలో నిర్వహించడం జరిగింది.అదేవిధంగా కోటమర్తి గ్రామ పాఠశాలలో ప్రధమ, ద్వితీయ,తృతీయ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు శాలువాలతో సన్మానం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కే రాజ్యవర్ధన్ రెడ్డి ఛైర్మెన్ చిత్తలూరి సరిత వెంకన్న ఉపాధ్యాయులు రామచంద్ర రెడ్డి,ఆవుల సైదులు గారు, రామచంద్రు బి రామదాసు ఫకీర్ మరియు గ్రామ గ్రామ మాజీ ఎంపిటిసి పాశం సత్యనారాయణ మాజీ సర్పంచ్ బాలు రిటైర్డ్ టీచర్ వీరయ్య గ్రామ పెద్దలు మరియు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.