కొత్త రాజోలికి కనీస సౌకర్యలు కల్పిచారా?
పునరావాసం పేరుతో 17 ఏళ్ల మోసం - కొత్త రాజోలి కాలనీలో కనీస సదుపాయాలు కూడా లేవు"
బిజెపి రాష్ట్ర కార్యవర్గం రామచంద్రారెడ్డి.
మండల కేంద్రంలో బిజెపి రాజోలి మండల అధ్యక్షుడు కనికే శశికుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2009 వరదల్లో ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు గృహాలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. కానీ ఇల్లు ఇచ్చి దాదాపు 16 సంవత్సరాలు అవుతున్నా ఆ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్ల వ్యవస్థ లేదు, కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఇదేనా పునరావాసం? వరదల్లో అన్నీ కోల్పోయి వచ్చిన ప్రజలకు ఇల్లు ఇచ్చి, రోడ్డు, డ్రైనేజీ, తాగునీరు, లైట్లు కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం సాధించింది? ఇది పునరావాసమా లేక మరోసారి బాధల పాలు చేయడమా? డ్రైనేజ్ వ్యవస్థ లేక చేనేత కార్మికుల మగ్గం గుంతలో మోకాళ్ళ లోతులో నీళ్లు రావడం జరుగుతుంది
ఎవరైనా చనిపోతే
3 కిలోమీటర్లు పరిస్థితి వస్తుంది స్మశాన వాటికలో లేవు కాలనీలో ఎక్కడ చూసినా పునర్వసంలో ఎక్కడ చూసినా ముళ్లపదలు పరితంగా ఉన్నవి దానివలన విష సర్పాలు దోమలు పందులు వస్తున్నాయి.
నిధులు ఎక్కడ?
కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఇస్తున్న ఎందుకు అభివృద్ధి నోచుకోవడం లేదు నిధులు ఏమయ్యాయి? కాంట్రాక్టర్లు, నాయకుల జేబుల్లోకి వెళ్లాయా?
ఆరోగ్యం ఎవరి బాధ్యత?
డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్లపై పారుతుంది. దోమలు, ఈగలు పెరిగి పిల్లలు జ్వరాలతో బాధపడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో ప్రజలు ఎలా బ్రతకాలి? ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తారా?
ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు?
గత 17 ఏళ్లుగా గెలిచిన MLA, MP,MPP, ZPTC, లు మరియు సర్పంచ్‌లు గత ప్రస్తుత ప్రజా ప్రతినిధులు ఒక్కసారి కూడా ఈ కాలనీలో పర్యటించి సమస్యలు అడిగారా? ఓట్లు అడిగేటప్పుడు వచ్చి, పని అయ్యాక మర్చిపోతారా?
బీజేపీ డిమాండ్:
1. 15 రోజుల్లో R&B, పంచాయతీరాజ్ అధికారులతో కాలనీని సర్వే చేయించి అంచనాలు తయారు చేయాలి.2. 3 నెలల్లో కాలనీలో *సిమెంట్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ,*పనులు ప్రారంభించాలి.
6 నెలల్లో పనులు పూర్తి చేయాలి
ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధులు స్పందించకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి మరియు పనులు పూర్తి అయ్యేవరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. పునరావాసం అంటే ఇల్లు ఇవ్వడం కాదు, గౌరవంగా బ్రతికే వాతావరణం కల్పించడం. ఈ కార్యక్రమంలో: జిల్లా ఉపాధ్యక్షుడు సంఘాల సంజీవరెడ్డి, మండల నాయకులు గోవిందరాజులు, రాజేష్, రమేష్ బాబు, ప్రకాశం, అంజి, గట్టు రాము, చిన్నప్ప, వీరేష్, కృష్ణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.