కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గద్దె దించడంతోపాటు 

Mar 2, 2024 - 21:23
 0  7
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గద్దె దించడంతోపాటు 

ఎన్డీఏ లోని కూటమి పక్షాలను ఓడించాలని 

ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మన్నవ.కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు.

పోలవరం  02 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గద్దె దించడంతోపాటు ఎన్డీఏ లోని కూటమి పక్షాలను ఓడించాలని ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మన్నవ.కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు.శనివారం పోలవరం మండల సిపిఐ కార్యదర్శి జల్లేపల్లి.వెంకట నరసింహారావు(జె.వి) అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.

 ఈ సమావేశాని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈనెల నాలుగవ తేదీన ఉదయం 10 గంటలకు బుట్టాయిగూడెం తహసిల్దార్ కార్యాలయం వెనుక భాగంలో గ్రౌండ్లో ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశానికి జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె. నారాయణ,జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని.వనజ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ.ప్రభాకర్ వస్తున్నారన్నారు.కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.అధిక ధరలు అదుపు చేస్తామని,సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని,నల్లధనం వెలికి తీసి ప్రతి వారి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని బూటకపు వాగ్దానాలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.మోడీని అవతార పురుషుడిగా, దేవుడిగా కొలిచేటట్లుగా ప్రజలను ముడా,అంద విశ్వాసాలలోకి నెట్టుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి కార్పోరేటర్లకు దోచిపెడుతున్నారని ద్వజమెత్తారు.మణిపూర్ లో జరుగుతున్న హింసకాండ,మహిళలపై జరుగుతున్న దాడులు పట్టించకపోవడం పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు.మణి పూర్ కి వెళ్లలేక పోవడం నిజస్వరూపం తెలుస్తుందని అన్నారు. అడవులను,మైనింగులను,మైనింగ్ సంపదనను ఆదాని కి కట్టబెట్టడానికి మణిపూర్ లో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.రామ మందిరం పేరుతో ప్రజల మత భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఓటులను పొందటానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒకసారి రాష్ట్రంలో మూడోసారి కేంద్రంలో అధికారం ఇవ్వాలని  నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నారని అప్రమత్తంగా ఓటు వేయాలని సూచించారు.ముహూర్తాలేలేని సమయంలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట  చేయడంతోనే వారి చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు.దేశ భద్రతా,మిలటరీ సంబంధిత అంశాలను బహిరంగ సభలో ఉపయోగించుకోవడం దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి చేయలేదని ఒక్క మోడీ మాత్రమే చేస్తున్నారని తెలియజేశారు.రాష్ట్రంలో పాలక ప్రతిపక్షాలు కేంద్రంలోని బిజెపికి వంతపడుతున్నాయన్నారు.ప్రాజెక్ట్ నిర్మాణం  ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.నిర్వాసితుల జీవితాలు దుర్భరం చేశారని విమర్శించారు. పునరావాస గ్రామాల్లో విద్యా వైద్యం అందని ద్రాక్ష అయ్యాయని అన్నారు.స్మశాన వాటిక లేని దుర్భర  పరిస్థితులలో కాలం గడుపుతున్నారని విమర్శించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించాలని లక్ష్యంతో సైనికుల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కదలి రావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఐ పోలవరం నియోజకవర్గం కార్యదర్శి కారం. దారయ్య,మండల సిపిఐ సహాయ కార్యదర్శి తిరుమల శెట్టి.రవికుమార్,పోలవరం పట్టణ కార్యదర్శి జల్లేపల్లి వేణుగోపాలకృష్ణ,సూరిబాబు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333