కామ్రేడ్ లింగంపల్లి రాములు గారి జీవితం భావితరాలకు ఆదర్శం 

తొమ్మిదవ వర్ధంతి సభలో MCPIU రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న పిలుపు.....

Apr 1, 2026 - 15:56
 0  2
కామ్రేడ్ లింగంపల్లి రాములు గారి జీవితం భావితరాలకు ఆదర్శం 
కామ్రేడ్ లింగంపల్లి రాములు గారి జీవితం భావితరాలకు ఆదర్శం 

సూర్యాపేట సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామంలో * పార్టీ జిల్లా కార్యదర్శి*షేక్ నజీర్ అధ్యక్షతనఅమరజీవి కామ్రేడ్ లింగంపల్లి రాములు గారి తొమ్మిదవ వర్ధంతి వారి స్తూపం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు *వరికుప్పల వెంకన్న గార్లు మాట్లాడుతూ ఎం సి పి ఐ యు ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి రైతు సంఘం రాష్ట్ర నాయకులు కందగట్ల మాజీ సర్పంచి లింగంపల్లి రాములు గారి జీవితం భావితరాలకు ఆదర్శమని కామ్రేడ్ బి ఎన్ ఓంకార్ అడుగుజాడలో ప్రయాణిస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా శ్రీరామ్ సాగర్ రెండవ సాధనలో వారి యొక్క ఆశయాలను తీసుకొని ఈ ప్రాంతంలో రైతులను కూడగట్టి ఉద్యమాలు నిర్వహించిన మహా నాయకుడు అని అన్నారు ఈ ప్రాంతంలో ప్రజల కోసం నిత్యం ప్రజా సమస్యలపై పనిచేస్తూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారని గుర్తు చేశారు ఈ గ్రామంలో పేదలైన బుడిగజంగాల కు  ఇండ్ల స్థలాలను ఇప్పించడంలో ఇల్లు కట్టించడంలో వారి పాత్ర అమోఘమని గుర్తు చేశారు దొరలకు జాగిరిదారులకు వ్యతిరేక పోరాటంలో కూలీ రేట్లు పెంచాలని వారు పోరాటాలు నిర్వహించారు. వారి యొక్క కుటుంబం నేటికీ పార్టీ నిర్మాణంలో పనిచేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరపాక  ఉగ్రయ్య నక్క శ్రీనివాస్ లింగంపల్లి రాజు బచ్చు కోటయ్య పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు వెంకటేశం వెంకన్న లింగంపల్లి రాములు గారి భార్య లింగంపల్లి ఎల్లమ్మ  కూతురు రేణుక అల్లుడు అశోక్  లింగంపల్లి ఓంకార్, లింగంపల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333