ఐదుగురు బిఆర్ఎస్ కౌన్సిలర్ల సస్పెండ్.

వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఈనెల మార్చి 7వ తేదీన జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన వైస్ చైర్మన్ అభ్యర్థి మారం కుమార్ కు వ్యతిరేకంగా ఓటు వేసి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన ఐదుగురు కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తూ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో రెండు మిద్దెల జయ(2వ వార్డు), యాచమనేని శ్రీనివాసరావు(11వ వార్డు), జడల లక్ష్మి(5వ వార్డు), మధు రాజేందర్ శర్మ(23వ వార్డు), ముప్పిడి సునంద(26వ వార్డు) లను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మిగతా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.