ఏపూరు ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ఉపాధ్యాయులు
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఏపూరు ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి USPC పిలుపుమేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏపూరు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపడం జరిగింది 1 తక్షణమే పిఆర్సి ప్రకటించాలని 2, పెండింగ్లో ఉన్న డీఎ లను విడుదల చేయాలని 3, ఈనెల 15లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని 4, విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని 5, జీవో 25 సవరణ చేసి అమలు చేయాలని 6 సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి ఎంఈఓ, డిప్యూటీ డి ఓ, డి ఈ ఓ పోస్టులను పదోన్నతులు ద్వారా నియమించాలని 7 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ల్ వర్తింపజేయాలని 8 కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని 9, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని 10, టెట్టులో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని స్పెషల్ టెట్ను సబ్జెక్టు వారి పేపర్లతో నిర్వహించాలని 11, మోడల్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలని 12, పెండింగ్లో ఉన్న బిల్లులన్నిటిని క్లియర్ చేయాలని 13, హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అమలు చర్యలు తీసుకోవాలని నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసనలో డి టి ఎఫ్ జిల్లా పూర్వ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, కోచర్ల వేణు,ప్రధానోపాధ్యాయులు జాన్, ఉపాధ్యాయులు బాసిత్, రమణ, పుష్ప కుమారి, విజయ్, నాగేందర్, విజయ, వెంకటేష్, విజయ్ కుమార్, రవి, మోహన్, శాస్త్రి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.