ఎస్ టి ఎల్ ఎస్ శ్రీనివాసులు విధి నిర్వహణలో చేసిన సేవలు మరువలేనివి
డిఎంహెచ్ఓ:- డాక్టర్ సిద్దప్ప.

జోగులాంబ గద్వాల 12 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లావైద్య ఆరోగ్యశాఖ డిపార్ట్మెంట్ నందు టీబి ప్రోగ్రాం లో ఎస్ టి ఎల్ ఎస్ గా దాదాపు 12 సంవత్సరములు సేవలు చేసిన అనంతరం 2017 వ సంవత్సరం టీఎస్పీఎస్సీ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ గా సెలెక్ట్ అయి రెగ్యులర్ జాబ్ వచ్చి మక్తల్ నందు పోస్టింగ్ వచ్చిన శుభ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప శాలువా పూల బొకేతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు .. రెగ్యులర్ జాబ్ వచ్చి వెళ్తున్న అందుకు చాలా సంతోషమని .. ఎక్కడ పనిచేసిన వినయ విధేయతలతో మెలగాలని అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు .జిల్లా టీబి ప్రోగ్రాం 12 సంవత్సరాలు నిర్విరామ కృషి చేసి మంచి పేరు తెచ్చుకున్నాడని జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ అభినందనలు తెలిపారు.....