ఎస్సై లేని పోలీస్ స్టేషన్

తిరుమలగిరి 08 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ నాలుగు జిల్లాలకు సరిహద్దు ప్రాంతమైన తిరుమలగిరి మండలానికి పది రోజులుగా ఎస్సై లేనందున అక్రమ దారులకు అడ్డు లేకుండా పోయింది గత పది రోజుల క్రితం పిడిఎస్ బియ్యం కేసులో ఎస్సై మరియు కానిస్టేబుల్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు దీంతో సిఐ రఘువీర్ రెడ్డి ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించినప్పటికీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి తిరుమలగిరి మున్సిపాలిటీలో నిత్యం ప్రజా రవాణా రద్దీతో ఉండడం మరియు తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం తిరుమలగిరిలో ఉండడంతో తిరుమలగిరి నుండి వివిధ కార్యక్రమాలు చేపట్టుతున్నప్పటికీ వివిధ సమస్యలు పరిష్కరించడానికి ఎస్ఐ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నిత్యం వందల కేసులతో ఉండే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేక సమస్యల పరిష్కారం కొరకు ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా ఎస్సైని నియమించి తిరుమలగిరి ప్రజారక్షణకు తోడ్పడాలని కోరుతున్నారు