ఎస్సీ సంక్షేమ పథకాలను పోరాడి సాధించుకోవాలి
మేడి పాపన్న మాదిగ. ఆదేశాల మేరకు
ఎస్సీ సంక్షేమ పథకాలను పోరాడి సాధించుకోవాలి.
కేదాసి మోహన్ మాదిగ రాష్ట్ర అధ్యక్షులు
అంబేద్కర్ అభయహస్తం అమలుకై ఉద్యమిద్దాం
చలో కోదాడ బహిరంగ సభను విజయవంతం .
తిరుమలగిరి 26 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేదాసి మోహన్ మాదిగ. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ మాట్లాడుతూ కోదాడ అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పోరాడారని, వర్గీకరణ సాధించినప్పటికీ దళితుల సంక్షేమానికి సంబంధించిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేసి దళిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, దళితులకు ఉన్నటువంటి అసైన్డ్ ల్యాండ్స్ కు అమ్ముకునే హక్కు కల్పిస్తామని ప్రభుత్వం చేవెళ్ల ఎస్సీల డిక్లరేషన్ లో హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలి. భూమిలేని ఎస్సీ కుటుంబాలకు భూమి, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు దళితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే దళితుల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలుతరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోలంపల్లి శ్రీనివాస్.కనుకు జానయ్య . రావూరి విజయభాస్కర్. మరికంటి అంబేత్కర్. కడప పెంటయ్య.కార్ల కాంతారావు. బలుగూరి హుస్సెన్. పల్లేటి లక్ష్మణ్. బాణాల అబ్రహం.గంగాధర రమణ. కందుకూరు నాగేశ్వరరావు.మిద్దె వెంకన్న..ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు