ఎస్సీ కమ్యూనిటీ హాల్ మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారింది.

Mar 9, 2026 - 20:44
Mar 9, 2026 - 20:45
 0  14
ఎస్సీ కమ్యూనిటీ హాల్ మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారింది.
ఎస్సీ కమ్యూనిటీ హాల్ మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారింది.

ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు ప్రభుత్వం నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలి.. యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా మాదిగ పెరియార్ అన్నారు.

భద్రాచల పట్టణంలో భగవాన్ దాస్ కాలనీ నందు నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ అస్తవ్యస్తంగా, మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారి అధ్వానంగా మారిందని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా మాదిగ పెరియార్ అన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ చెత్త చదారాలతో,వ్యసన పరులకు విలాసవంతం భవనం గా మారిందని, వ్యసనపరులు కమ్యూనిటీ హాల్ లోపల గౌరవప్రదంగా పెట్టుకున్న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కించపరిచే విధంగా కిందపడేసి విగ్రహ పెచ్చులు ఊడదీశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దని, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాకపోవడం బాధాకరమని, ప్రభుత్వానికి ఎస్సీల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించి మహనీయుల మాసం ఐన ఏప్రిల్ నెలలోపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై దశల వారి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333