ఎస్‌ఐఆర్‌లో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు అందించి పకడ్బందీగా విచారణ చేపట్టాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి
ప్రతి ఓటరుకు నోటీసు అందేలా చర్యలు తీసుకోవాలి
విచారణ ప్రక్రియను పారదర్శకంగా,నిబంధనల ప్రకారం నిర్వహించాలి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
------------------------------
సూర్యాపేట , సెప్టెంబర్ -07:
------------------------------
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించి, వారితో పకడ్బందీగా విచారణ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ, పంపిణీ, విచారణ ప్రక్రియపై జిల్లాల వారీగా సమీక్షించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ
అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు పంపిణీ చేయాలని సూచించారు. నోటీసులు అందించిన అనంతరం సంబంధిత ఓటర్లకు విచారణకు పూర్తి అవకాశం కల్పించి, వారి వివరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
విచారణ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ
జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణ ప్రక్రియ కూడా కొనసాగుతోందని, నిర్ణీత గడువులోగా విచారణను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలోని ప్రతి వివరాన్ని నిశితంగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షిస్తూ, నిబంధనల ప్రకారం అనామలీస్, నో మ్యాపింగ్ అంశాలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అదనపు కలెక్టర్ బి హరి సింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, ఆర్డీవోలు, సంబంధిత ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.