ఎర్రోళ్ల శ్రీనివాస్ కే వరంగల్ ఎంపీ టికెట్...!
ఉద్యమ నాయకుడు కావడంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ నే దాదాపు ఖరారు చేసిన బీఆర్ఎస్ అధిష్టానం...?
లోక్ సభ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అభ్యర్థులను సిద్ధం చేశారు కేసీఆర్. అయితే ఉద్యమ వీరులకే ఈ సారి పెద్దపీట వేయాలని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ భావిస్తున్నారట. ఏదీ ఎలా ఉన్నా... వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కేసీఆర్ ఫైనల్ చేశారట. అందరివాడిగా ఇప్పటికే మన్ననలు పొందిగా ఎర్రోళ్ల శ్రీనివాస్ గెలుపు కూడా నల్లేరుపై నడకేనని తెలుస్తోంది.ఎర్రోళ్ల శ్రీనివాస్... తెలంగాణ సమాజానికి పరిచయం అక్కర్లేని నాయకుడు. స్వరాష్ట్ర సాధనకోసం... ఉద్యమసారధి అడుగుజాడల్లో నడుస్తూనే.. రాముడికి హనుమంతుడు ఎలాగో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఎర్రోళ్ల శ్రీనివాస్ అలా మెలిగారు. తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు.. తుపాకీ తుటాలను సైతం లెక్క చేయకుండా.. ఒంటికి ముళ్ల కంచెలగీసుకున్నా... ధరణిపై నెత్తుటి ధారలు కారినా... కంఠంలోనుంచి జై తెలంగాణ అనే నినాదంతోనే రక్తపు గాయాల్లోను నవ్వుతోనే జయించాడు ఎర్రోళ్ల శ్రీనివాస్. బక్కపలచని వాడికి మరింత బలంగా ముందుకు సాగారు ఎర్రోళ్ల శ్రీనివాస్. అలాంటి ఎర్రోళ్ల శ్రీనివాస్ కి ఇప్పుడు ఓరుగల్లు నుంచి పార్లమెంట్ లో గళం విప్పే అవకాశం వస్తోంది.
ఉద్యమ వీరుడిగా ఎర్రోళ్ల శ్రీనివాస్ కి గుర్తింపు
తెలంగాణ ఉద్యమంలో తుపాకీ తూటాలను లెక్క చేయని ఎర్రోళ్ల శ్రీనివాస్ కి ఉద్యమ ప్రస్థానంలో ప్రత్యేక స్థానం ఉంది.ఉద్యమంలో విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చి... తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన దైన పాత్రను పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేసి, మలిదశ ఉద్యమంలో పాల్గొని విద్యార్థి లోకాన్ని నడిపించారు. టీఆర్‌ఎస్ పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఏరోళ్ల శ్రీనివాస్.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చిన ఉద్యమనేత ఎర్రోళ్ల శ్రీనివాస్.
మలిదశ ఉద్యమంలో విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చిన నేత ఎర్రోళ్ల శ్రీనివాస్.2010లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ వరకు, అక్కడి నుంచి అదిలాబాద్ వరకు 750 కిలోమీటర్లు సాగిన ఉద్యమానికి... మహాపాదయాత్రలో ప్రధాన పాత్ర పోషించారు. 2010 నుంచి 2016 వరకు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 2018 నుంచి 2020 వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసి, సీఎం కేసీఆర్ సహకారంతో కమిషన్ కార్యాలయాన్ని కార్పొరేట్ ఆఫీసు తరహాల మార్చారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను దేశంలోనే రోల్ మోడల్‌గా మార్చడానికి కృషి చేశారు. 13,905 కేసుల్లో అట్రాసిటీ బాధితులకు పరిహారంగా 78 కోట్లకు పైగా పంపిణీ చేయడంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. దళితుల, ఆదివాసీల జీవన స్థితిగతులపై వ్యక్తిగత తనిఖీ కోసం 819 క్షేత్ర పర్యటనలో 7,932 అర్జీలను స్వీకరించి పరిష్కరించారు ఎర్రోళ్ల శ్రీనివాస్.
ఒక సామన్య కుటుంబం నుంచి వచ్చిన ఎర్రోళ్ల శ్రీనివాస్ .అందరికి పెద్దన్నగానే నిలుస్తూ వచ్చారు. ఆపదలో ఉన్నవారు అన్నా అంటే చాలు..తన వంతుగా సాయం అందించేవారు. ఇప్పటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. అందరి చేత శభాష్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అని మెప్పుపొందారు.
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఎర్రోళ్ల శ్రీనివాస్ తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఈ ఉద్యమవీరుడికి బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు చట్టసభల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ ఎంపీగా అభ్యర్థిగా ఇప్పటికే ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరును కేసీఆర్ పరిశీలించాడట. ఉద్యమ నేతగా..విద్యార్థి నాయకుడిగా..ప్రజల కష్టాలు దగ్గరనుంచి చూసిన సామాన్యుడిగా.. ఎంత ఎదిగినా ఒదిగే తత్వం ఎర్రోళ్ల శ్రీనివాస్ సొంతం కావడంతో..అతను అయితేనే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాగుంటుందని అధిష్టానం భావిస్తోంది. చివరిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఎర్రోళ్ల శ్రీనివాస్ కి యువత బలం ఎక్కువ... పార్టీలకు అతీతంగా ప్రజల మద్దతు ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.