ఎమ్మెల్యే మందుల సామేలు, మండల అధ్యక్షులు జనార్ధన్‌కు శుభాకాంక్షలు

జేరిపోతుల శోభ రాణి మాజీ ఎంపీపీ

Jul 12, 2026 - 21:31
Jul 12, 2026 - 22:57
 0  4
ఎమ్మెల్యే మందుల సామేలు, మండల  అధ్యక్షులు జనార్ధన్‌కు  శుభాకాంక్షలు

  ఎస్సీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే ఎన్నిక కావడం గర్వకారణం.

• కష్టపడే ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తిస్తుంది. 

• చెప్పుడు మాటలు నమ్మి పార్టీకి మోసం చేయవద్దు.

• తిరుమలగిరి మండలంలో వర్గ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేద్దాం.

 తిరుమలగిరి 13 జులై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల (ఎస్సీ) సంక్షేమ కమిటీ సభ్యులుగా నియమితులైనందుకు, అలాగే తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సుంకరి జనార్ధన్ కు  తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ ఎంపీపీ జేరిపోతుల శోభారాణి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మండల ప్రజల తరఫున,  ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే చిన్న కార్యకర్తకైనా అధిష్ఠానం తగిన గుర్తింపు ఇస్తుందని స్పష్టం చేశారు. "కార్యకర్తలు ఎవరూ చెప్పుడు మాటలు విని భ్రమపడవద్దు, పార్టీకి మోసం చేయవద్దు. నిబద్ధతతో పనిచేసే వారిని పార్టీ ఎల్లప్పుడూ ఆదరిస్తుంది" అని పిలుపునిచ్చారు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే సామేలు గెలుపు కోసం రాత్రింబవళ్లు వివిధ గ్రామాల్లో తిరిగి కష్టపడ్డానని, సొంత ఖర్చులతో కార్యకర్తలను ఆదుకుంటూ పార్టీ సేవలో ఉన్నానని తెలిపారు.

 సమష్టిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం:

 తిరుమలగిరి మండలంలో ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా, కొత్త-పాత అనే తేడాలు పక్కనపెట్టి నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో, ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. మండలంలోని గ్రామపంచాయతీల్లో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే సామేలు, నూతన మండల అధ్యక్షులు జనార్ధన్ నిరంతరం సహకరిస్తారని ఆకాంక్షించారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి