ఉరి వేసుకొని భార్య భర్త మృతి
ప్రముఖ వ్యాపార కుటుంబం ఆత్మహత్య
అనారోగ్యంతో బాధపడుతున్న దంపతులు
శోకసంద్రంతో మునిగిన తిరుమలగిరి మండలం
మృతితో పలువురు సంతాపం
తిరుమలగిరి 24 జులై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన వడియాల శ్రీనివాస్ తండ్రి వీరయ్య వయసు 59 సంవత్సరాలు వృత్తి కిరాణం షాపు మరియు అతని భార్య ఒడియాల సోమలక్ష్మి భర్త శ్రీనివాస్ వయసు 52 సంవత్సరాలు కులం వైశ్య వృత్తి కిరాణా వ్యాపారస్తులు ఫ్యాన్లకు ఉరివేసుకొని మరణించారు ఉదయం 6 గంటల 40 నిమిషాల వరకు తన కుమారుడు ఒడియాల శ్రావణ్ కొత్త ఇంటి వద్ద నుండి పాత ఇంటి వద్ద వచ్చేసరికి ఇంటి లోపల హాల్లో ఉన్నటువంటి రెండు ఫ్యాన్లకు వేరువేరుగా ఉరివేసుకొని చనిపోయి ఉన్నారు వెంటనే చుట్టుపక్క వారిని పిలిచి క్రిందకి దింపి చూడగా అప్పటికే మృతి మృతి చెందినారు వారు ఇరువురు గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అట్టి సమస్యలకు మనస్తాపం చెంది రాత్రి సమయంలో ఎవరు లేనిది చూసి ఇంటిలో ఇద్దరు భార్యాభర్తలు వేరువేరుగా ఫ్యాన్లకు ఉరివేసుకొని చనిపోయినారు, వారి కుమారుడు ఒడియాల శ్రావణ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు...