ఉన్నత విద్యను అభ్యసించడానికి చేరండి

Feb 13, 2025 - 01:52
Feb 13, 2025 - 01:54
 0  7

పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా సి కృష్ణయ్య , జ్ఞానేశ్వర్ రెడ్డి, రవీందర్, నవీన్ కుమార్, జాకీర్ హుస్సేన్ వెంకటాపూర్ గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలకు, మరియు జిల్లా ఉన్నత పాఠశాల అయ్యవారిపల్లి గ్రామం పాఠశాలలకు వెళ్లడం జరిగింది. ఆయా పాఠశాలలోని విద్యార్థులతో ముఖాముఖిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ, వచ్చే విద్య సంవత్సరం అకాడమిక్ ఇయర్ జూన్ లో అధికంగా విద్యార్థులను అడ్మిషన్స్ చేయించుటకై మీ దగ్గరికి రావడం జరిగిందని తెలిపారు. అధ్యాపకులు మాట్లాడుతూ తమ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఔన్నత్యాన్ని అక్కడి విద్యార్థిని విద్యార్థులతో తెలియజేస్తూ, మీరు పదవ తరగతిలో మంచి ఫలితాలను సాధించి పై చదువుల కోసం ఇంటర్మీడియట్లో మా ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేర్ లో చేరవలసిందిగా విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. మా కళాశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి, నాణ్యతమైన విద్యను అభ్యసించడానికి కావలసిన అన్ని వసతుల తో కూడుకొని, విశాలమైన క్లాస్ రూమ్స్ ఉన్నాయని , అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్ ఉన్నాయని పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు కృష్ణయ్య తెలియజేశాడు, విద్యార్థులు ఆహ్లాదకరంగా మానసిక వికాసాన్ని పెంపొందించుకోవడానికి, ఆటలు ఆడుకోవడానికి ప్రతి శనివారం గేమ్స్ పీరియడ్ ను కేటాయించామని తెలిపారు. జ్ఞానేశ్వర్ రెడ్డి, రవీందర్ మాట్లాడుతూ మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు జేఈఈ మెన్స్ లో మంచి ర్యాంకులు దానప్పటికీ ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వ కళాశాల చదువుతున్న విద్యార్థులకు సీతం కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం వనపర్తి జిల్లాలో ప్రైవేటు కళాశాలలకు దీటుగా మంచి మార్కులు, మా కళాశాల ఆణిముత్యాలు అయిన విద్యార్థులు సాధిస్తూ వస్తున్నారని, ఈ మధ్యకాలంలోనే కలెక్టర్ గారి చేతుల అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో గ్రూపులు ఉన్నాయని, ప్రతి సంవత్సరం మా జూనియర్ కళాశాల నుండి మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తూ వస్తున్నారని అక్కడి పదవ తరగతి విద్యార్థులకు తెలియజేశారు. మీరు కూడా మా కళాశాలలో చేరండి మీ భవిష్యత్తు చదువుల అభివృద్ధి కోసం , మేమంతా మార్గదర్శకులుగా మేం మీ వెంట ఉంటామని, మీరు ఉత్తమ ఫలితాలు సాధించడానికి మేమంతా కృషి చేస్తామని తెలిపారు. ఆ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులతో, వెంకటాపురం, అయ్యవారిపల్లి పాఠశాలల మీ విద్యార్థులను మా ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేర్ లో చేర్పించవలసిందిగా వారిని అభ్యర్థించారు. జిల్లా ఉన్నత పాఠశాల వెంకటాపురం గ్రామం, అయ్యవారిపల్లి జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా పాఠశాల విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేరులో చేరడానికి మా పాఠశాల ఉపాధ్యాయులు, మేమంతా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నామని అందుకు మేమంతా కృషి చేస్తామని తెలిపారు. జూనియర్ కళాశాల అధ్యాపకులు, అయ్యవారిపల్లి గ్రామంలో అక్కడి పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు పూల మొక్కలను అందజేసి, మీ చదువులతోపాటు పూల మొక్కలను కూడా నీరు పోసి పెంచి ఎదగనివ్వాలని విద్యార్థులకు గుర్తుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సి కృష్ణయ్య , పి జ్ఞానేశ్వర్ రెడ్డి, బి రవీందర్ , ఎం నవీన్ కుమార్ , ఎండి జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333