ఉన్నత అధికారుల క్షేత్ర సాయి సందర్శన

Jul 24, 2026 - 21:36
 0  1
ఉన్నత అధికారుల క్షేత్ర సాయి సందర్శన
ఉన్నత అధికారుల క్షేత్ర సాయి సందర్శన

 జోగులాంబ గద్వాల 24 జులై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  మండలం పరిధిలో గోపాల్ దీన్నే గ్రామంలోని శుక్రవారం నాడు ఇటిక్యాల వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల క్షేత్ర సందర్శన – రైతులకు  వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి అలంపూర్ తాలూకా సహాయ వ్యవసాయ సంచాలకులు సుబ్బారెడ్డి  గోపాల్దిన్నె గ్రామంలోని పత్తి పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ....
పంట ఎదుగుదల, మొక్కల ఆరోగ్యం, కీటకాలు మరియు వ్యాధుల పరిస్థితిని పరిశీలించి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులకు క్రింది సూచనలు అందించారు:
ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా పంటను తరచుగా పరిశీలించి ప్రారంభ దశలోనే కీటకాలు, వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.
వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన మందులను మాత్రమే సరైన మోతాదులో ఉపయోగించాలి.
అవసరానికి అనుగుణంగా ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి.
పొలంలో వరుస దుక్కులు చేసి, తేమను నిలుపుకోవాలని, కలుపు మొక్కలను తొలగించి పరిశుభ్రతను నిర్వహించాలి.
నీటి లభ్యతను బట్టి శాస్త్రీయ పద్ధతిలో నీటి యాజమాన్యం చేపట్టాలి.
పంటలో గులాబీ రంగు పురుగు (Pink Bollworm) వంటి ప్రధాన కీటకాల పర్యవేక్షణ కోసం ఫెరోమోన్ ట్రాప్‌లను ఏర్పాటు చేయాలి.
ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు.
ఉన్నతాధికారుల సూచనలను రైతులు ఆసక్తిగా విని, వాటిని పాటించి అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గోపాల్దిన్నె వ్యవసాయ విస్తరణ అధికారి కవితారాణి, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, ఇతర గ్రామస్థాయి అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333