ఉత్తరప్రత్యుత్తరాల్లో సమాచార హక్కు చట్టం 2005 'లోగో' ఉండాలి
రాష్ట్ర అధ్యక్షులు కొర్ర. కిషన్ నాయక్
తెలంగాణవార్త డిండి మండల ప్రతినిధి:- సమాచార హక్కు చట్టానికి బహుళ ప్రచారం కల్పించి ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టంపై ఓ చిహ్నం (లోగో )కు రూపాకల్పన చేసింది. దేనికి విశేష ప్రచారం కల్పించడం ద్వారా సామాన్యుడు అవసరమైన సమాచారంతో పాటు పాలనలోని లోటుపట్లను ఎత్తి చూపించే అవకాశాలను ఇవ్వాలని భావించి లోగోను రూపొందించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు (డీవోపీటీ ఓఎం నెం. ఎఫ్ 1/13/2010-ర్ తేది :24-1-2011, ఏపీ ప్రభుత్వ సరుక్యులర్ యు.వో.నోట్ నెం.5332/జీపీఎం&ఏఆర్/2011 తేది : 19-10-2011)జారీ చేసింది. అధికార యంత్రంగం చేయు ఉత్తర ప్రత్యుత్తరలాన్నింటిలో సమాచార హక్కు చట్టం లోగోను తప్పనిసరిగా వినియోగించాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి.వ్యక్తిగత, ప్రజాసమస్యల పరిష్కారం కోసం, సలహాలు సూచనలు కోసం సంప్రదించవలసిన ఫోన్ నెం. FWO RTI రాష్ట్ర అధ్యక్షులు కొర్ర. కిషన్ నాయక్,9885122005 తెలియపర్చుతాను