ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం
జోగులాంబ గద్వాల 1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఎర్రవల్లి. ఈరోజు ఎర్రవల్లి గ్రామం లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ , భువనేశ్వరి, & డాక్టర్ , వినయ్ కుమార్, మాట్లాడుతూ...... ఎదకు రాని పశువులకు చూడి కట్టని పశువులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి చికిత్స చేసి పాడి రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. సరి అయిన పోషణ సమతుల్య దాన అందించడం పరానా జీవులను నిర్మూలించడం పరిశుభ్రమైన యాజమాన్య పద్ధతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించటం మొదలగునవి పాటించటం ద్వారా పశువులు సకాలంలో ఎదకు వచ్చి చుడి కడతాయి సంవత్సరానికి ఒకటి దూడను పొంది పాడి రైతులకు లాభం చేకూరుతుందని తెలియజేయడం జరిగింది. ఈ శిబిరంలో ఈరోజు( 21 గేదెలకు) (నాలుగు ఆవులకు) పరీక్షలు చేసి చికిత్స అందించడం జరిగింది వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ వినయ్ కుమార్, ప్రభాకర్ వైద్య సిబ్బంది గోపాలమిత్ర సూపర్వైజర్ జయసింహ తదితరులు పాల్గొన్నారు.